Tue Nov 05 2024 07:57:32 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఏందియ్యా ఇదీ.. ఇలా తగ్గుతుందేంటి...? పెరగడానికేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా తగ్గింది.
బంగారం అంటే ఇష్టం లేనిదెవరికి? ప్రతి ఒక్కరికీ ప్రియమైన వస్తువు పసిడి. అందులోనూ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడాన్ని ప్రజలు అలవాటుగా మార్చుకున్నారు. పొదుపు చేయడంలో భాగంగా బంగారం కొనుగోలు కూడా ఒక విధానంగా మారిపోయింది. బంగారం ఎంత ఉంటే తమ జీవితంలో కష్టనష్టాలు ఎదురయినప్పుడు భరోసాగా ఉంటుందన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
క్లిష్ట సమయంలో...
ముఖ్యంగా కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కొన్ని నెలల పాటు ఉపాధి కరువైన సందర్భంలో బంగారం ఆదుకుంది. బంగారాన్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుని, తిరిగి కుదుట పడిన తర్వాత దానిని విడిపించుకున్న వారు లక్షల్లో ఉన్నారు. బంగారాన్ని కొనడం ఎంత కష్టమో.. విక్రయించడమో.. కుదువ పెట్టడమో అంత తేలిక. అందుకే బంగారం ధరలు పెరిగినా పెద్దగా జనం పట్టించుకోరు. పైగా పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవ్వడంతో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
అయితే మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగానే పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,990 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,170 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 75,400 రూపాయలుగా నమోదయింది.
Next Story