Tue Nov 26 2024 13:31:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : ధరలు పెరగాల్సిన సీజన్ లో తగ్గడమేంటి? రీజన్ ఇదేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధరపై యాభై రూపాయలు తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది
గణతంత్ర దినోత్సవం రోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పెరగాల్సిన సీజన్ లో ధరలు తగ్గడం అంటే ఆషామాషీ కాదు. ఒకవైపు పెళ్లిళ్లు.. శుభకార్యాల సీజన్ అయినా ధరలు తగ్గుముఖం పడుతుండటం ఆనందమే. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం ధరలు తగ్గడంలేదు. కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు ఈ ధరలు కొంచెంగా తగ్గుతున్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది. అయితే ధరలు తగ్గినంత మాత్రాన కొనుగోళ్లు పెరుగుతాయా? అంటే చెప్పలేం అంటున్నారు వ్యాపారులు.
బడ్జెట్ ను చూసి...
కేంద్ర బడ్జెట్ త్వరలో ఉండటంతో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు భయపెడుతున్నారు. ఎంత పెరుగుతాయో చెప్పలేం అని అంటున్నారు. అందుకే ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. బడ్జెట్ బంగారంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అన్నది ఆధారపడి ఉంటుంది. అందుకే బడ్జెట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పకతప్పదు. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆశ మాత్రం జనాల్లో ఉంది.
వెండి భారీగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధరపై యాభై రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై ఏడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 77,500 రూపాయలుగా ఉంది.
Next Story