Mon Nov 25 2024 19:52:14 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలకు బ్రేకులు పడుతున్నాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగానే తగ్గాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో తగ్గాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ఎప్పుడూ అంచనాలు వినపడుతూనే ఉంటాయి. దీనికి అనేక కారణాలు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ప్రతి రోజూ ఉంటాయి. సీజన్ తో నిమిత్తం లేకుండా సేల్ అయ్యే వస్తువు కావడంతో బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయంటారు.
ప్రధాన కారణం...
ధరలు పెరగడానికి ఒక కారణమంటూ లేదు. ప్రధాన కారణం మాత్రం కొనుగోళ్లు పెరగడం.. ఆ డిమాండ్ కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడమే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతుంటారు. బంగారాన్ని కొనుగోలు చేయడం నేటి రోజుల్లో అంత సులువు కాదు. అయితే జ్యుయలరీ దుకాణాలు ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తుంటాయి. ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసే పద్ధతి రావడం కూడా కొనుగోళ్లు తగ్గకపోవడానికి కారణంగా చూడాలి.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు కొంత తగ్గాయి. స్వల్పంగానే తగ్గాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,140 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,240 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 86,400 రూపాయలుగా నమోదయింది.
Next Story