Sat Dec 21 2024 12:00:42 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : దసరా పండగకు ముందే బంగారం ధరలు తగ్గుతాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం అంటేనే భారత్ లోనే కాదు ప్రపంచంలోనే మక్కువ ఎక్కువ. పసిడికి అంత డిమాండ్ పెరగడానికి కారణం ముఖ్యంగా మహిళలే. ఎక్కడైనా మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. విదేశాల్లో అయితే వారు వీరు అని లేదు. బంగారాన్ని పెట్టుబడి కింద చూస్తూ కొనుగోలు చేస్తారు. కానీ భారత్ లో అతి ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మహిళలు తమ మెడలో ఎంత బంగారం ఉంటే సమాజంలో తమకు అంత గౌరవం లభిస్తుందని భావిస్తారు. స్టేటస్ సింబల్ గా చూస్తూ తమను తాము బంగారమని అద్దంలో చూసి మురిసి పోతుంటారు. అందుకే బంగారం ధరలు పెరిగినా పెద్దగా ఇబ్బంది లేదు.
దక్షిణ భారతదేశంలోనే...
దేశంలోనే అత్యధికంగా ఎక్కువగా బంగారం అమ్ముడుపోయేది ఒక్క దక్షిణ భారతదేశంలోనే. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువ. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి వీటికి విధిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇక పండగలు, పబ్బాలకు కూడా బంగారాన్ని సొంతం చేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. ఇక నవంబరు, డిసెంబరు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయంటున్నారు. దేశ వ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంటున్నారు. ఇంక బంగారం కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనక్కు తగ్గరు. అందుకే ఈ రెండు నెలలు పసిడికి మరింత డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ తో పాటు ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
కొద్దిగా తగ్గినా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. నిజానికి ఈ సీజన్ లో బంగారం ధరలు తగ్గడం పసిడి లవర్స్ కు కొంత ఊరటనిచ్చే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,660 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 1,02,900 రూపాయలుగా ఉంది.
Next Story