Sun Nov 24 2024 17:55:28 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : దిగివచ్చిన బంగారం ధరలు.. ఇక పండగే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
పసిడి కొనుగోలు చేసే వారు ఎప్పుడూ ధరలు ఎంత ఉన్నాయో చూస్తారు. తక్కువగా ఉంటే ఠక్కున కొనుగోలు చేస్తుంటారు. బంగరాన్ని తగ్గినప్పుడు సొంతం చేసుకోవడం అనేక మంది అలవాటుగా మార్చుకున్నారు. కొందరు తమ అవసరాల కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే మరికొందరు పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చి చేరే ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఉత్సాహ పడుతుండటం మామూలే. అందుకే పుత్తడి కొనుగోలు విషయంలో ముహూర్తాలు చూడరు. తమ వద్ద ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేసి దానిని తమ ఇంట్లో భద్రపర్చుకుంటారు.
ధరలు తగ్గని...
బంగారం కొనుగోలు చేయడానికి ఒక సందర్భం అంటూ ఏమీ లేదు. గతంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేసేవారు. రాను రాను ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే బంగారాన్ని బహుమతిగా తమకు ఇష్టమైన, అత్యంత దగ్గర వారికి ఇవ్వడం హాబీగా మారింది. బంగారు వస్తువు ఇస్తే అవతలి వారి కళ్లల్లో ఆనందం వేరు. మిగలిన ఏ వస్తువులు బహుమతిగా ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ గోల్డ్ విషయంలో మాత్రం అమితానందం పడతారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అలాగే ధరలు కూడా తగ్గవు. బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్ లో ఎలాంటి నష్టం వాటిల్లిదన్న నమ్మకంతోనే ఎక్కువ సంఖ్యలో దీని కొనుగోళ్లకు ఇష్టపడుతుంటారు.
స్వల్పంగా తగ్గినా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,880 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలకు చేరుకుంది. ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలుంటాయి. తర్వాత బంగారం ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.
Next Story