Fri Jan 03 2025 05:36:43 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలకు దసరా పండగకు ముందే శుభవార్త.. దిగుతున్న బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు దిగి వస్తున్నాయి. సీజన్ సమీపించే కొద్దీ ధరలు స్వల్పంగానైనా తగ్గుతుండటం పసిడి ప్రియులకు ఊరట కల్గించే అంశమేనని చెప్పాలి. దసరా పండగకు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు తగ్గుతుండటం ఒకింత ఉపశమనం కల్గిస్తున్నాయి. పెళ్లిళ్లు ముందుగానే ఫిక్స్ చేసుకున్న వారంతా ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని భావించి కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఈ ధరలకు అడ్వాన్స్ ఇచ్చి బంగారు ఆభరణాలను ఆర్డర్ ఇస్తుండగా, మరికొందరు తమకు నచ్చిన బంగారు ఆభరణాలను సొంతం చేసుకుంటున్నారు. దీంతో జ్యుయలరీ దుకాణాలన్నీ వినియోగదారులతో సందడిగా మారాయి.
ధరలు తగ్గుతున్నా...
బంగారం అంటేనే మక్కువ ఉండని వారు ఎవరు ఉంటారు? ఈ మధ్య కాలంలో మహిళలతో పాటు పురుషులు కూడా పసిడిని ఇష్టపడుతున్నారు. అందుకే బంగారానికి మరింత ఎక్కువగా డిమాండ్ పెరుగుతుందంటున్నారు వ్యాపారులు. మామూలుగా ప్రతి రోజూ బంగారం ధరల్లో మార్పులుంటాయి. స్వల్పంగానో, భారీగానో తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. కానీ నవంబరు, డిసెంబరు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో ఇప్పుడు బంగారం ధరలు ప్రతి రోజూ స్వల్పంగా తగ్గుతుండటం ఆనందకరమైన విషయమే. అయితే అనుకున్న స్థాయిలో బంగారం, వెండి ధరలు తగ్గడం లేదన్న అసంతృప్తి మాత్రం కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాల వంటి కారణాలతో ప్రతి రోజూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఈరోజు ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,240 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story