Mon Nov 18 2024 04:26:34 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్... దిగివచ్చిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకరకంగా మదుపరులకంటే... కొనుగోలుదారులు ఖుషీ అవుతున్నారు. గతంలో పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలకు వరకూ చేరుకుంది. నేడు 70 వేల కంటే తక్కువగా లభిస్తుండటంతో నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా మహిళలు ఈ సీజన్ లో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభముహూర్తాలు కూడా అధికంగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య గతంలో కన్నా ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మొన్నటి వరకూ..
దీపావళి, థన్ తెరాస్ వరకూ బంగారం ధరలు అస్సలు తగ్గలేదు. దీంతో కొనుగోళ్లు కూడా మందగించాయి. దీంతో వ్యాపారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు పసిడి, వెండి ధరలు తగ్గుతుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయని, ఇది తమకు మంచి పరిణామమని వ్యాపారులు కూడా ఖుషీ అవుతున్నారు. గతంలో పెట్టుబడిదారులు సయితం ఒకింత ఆలోచించారు. ధర ఎక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం మంచిది కాదని బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేశారు. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారు.
తగ్గిన ధరలు...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావడం, ట్రంప్ విజయం సాధించిన రోజు నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ ధరలు తగ్గుతూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 75,640 రూపాయలుగా కంటిన్యూ అవుతుంది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story