Wed Dec 04 2024 18:51:55 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం ధరలు కిందకు దిగివస్తున్నాయి బాసూ.. ఇక కొనేసేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకసారి పరుగు అందుకుంటే వాటిని ఆపడం కష్టమే. ధరలు పెరగడం ప్రారంభించిన తర్వాత ఆగడం అనేది సాధారణంగా జరగదు. కాలంతో సంబంధం లేకుండా, సీజన్ తో నిమిత్తం లేకుండా బంగారం, వెండి కి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. అయితే బంగారం ధరలు పెరిగాయని ఎవరూ కొనుగోలు చేయకుండా ఆగరు. ఎందుకంటే బంగారాన్ని సొంతం చేసుకునే వారు ఈ జనరేషన్ లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు. కొన్ని జనరేషన్లు మారుతున్న బంగారం, వెండి పట్ల ఆసక్తి తగ్గలేదు. అందుకే బంగారం, వెండి ధరలకు నిరంతరం డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఐశ్వర్యం తో పాటు అందం...
బంగారం అంటే అందంతో పాటు ఐశ్వర్యం కూడా మహిళలు భావిస్తారు. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతారు. అందం కూడా బంగారు నగలతోనే ఇనుమడిస్తుందని భావించే వారు ఈ కాలంలో కూడా యువతులు ఉండటంతో బంగారం అమ్మకాలపై జనరేషన్ గ్యాప్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. పైగా ధరలు పెరగడంతో కొనుగోళ్లు ఆగలేదు. ప్రజల కొనుగోలు శక్తి కూడా అదే స్థాయిలో పెరగడం కూడా బంగారం, వెండి అమ్మకాలు నిలకడగానే కొనసాగడానికి కారణాలుగా చెబుతున్నారు. బంగారం తమ వద్ద ఉంటే సురక్షితమని భావించే వారు అధికశాతం మంది ఉన్నారు. అదే సమయంలో పెట్టుబడి పెడితే బంగారం నష్టం తెచ్చిపెట్టదన్న నమ్మిక కూడా బలంగా ఉంది.
ధరలు ఇలా...
బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. కానీ అదే సమయంలో సీజన్ కూడా నడుస్తుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత బంగారం ధరలు కొంత తగ్గినా మళ్లీ పరుగు ప్రారంభించాయి. అందుకే బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,890 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,340 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 99.400 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story