Mon Dec 23 2024 19:04:05 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : ధరలు తగ్గినా.. కొనుగోళ్లు అంతగా లేవట.. కారణం ఏంటంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి
పసిడి కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్లాలి. గతంలో మాదిరి మనకు అవసరమైనంత బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా మన బడ్జెట్ సరిపోయే పరిస్థితి. ఇప్పుడు లేదు. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలతో మధ్యతరగతి జీవులకు పసిడి కొనుగోలు చేయాలంటే పెద్ద భారంగా మారింది. అందుకే పసిడి వైపు చాలా మంది చూడటం మానేశారు. బంగారం కొనుగోలు చేయడం కంటే బ్యాంకుల్లో దాచుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు చాలా మంది.
కొనుగోలు దారులు...
భారత ప్రభుత్వం దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినా ధైర్యంగా బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బంగారం కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఈసారి ధన్‌తెరాస్ కు కూడా బంగారం కొనుగోళ్లు తగ్గాయంటే ధరలు ఎంత పెరిగాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.
నేటి ధరలు...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై యాభై రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,640 రూపాయలుగా నమోదయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కిలో వెండి ధర స్థిరంగా 79,000 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story