Tue Nov 05 2024 19:45:31 GMT+0000 (Coordinated Universal Time)
Today Gold Price : గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధర తగ్గిందిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కొద్దిగా పెరిగాయి.
బంగారం ధరల్లో నిత్యం మార్పులు కనిపిస్తుంటాయి. ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మధ్యాహ్నానికి మారిపోతాయి. పసిడి, వెండి ధరలు పెరుగుల కామనే. దానికి వినియోగదారులు కూడా అలవాటుపడిపోయారు. కానీ తమ అవసరాల కోసం కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయక తప్పదు. దక్షిణ భారత దేశంలో పుత్తడి, వెండి ఒక సెంటిమెంట్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. ఇక కుమార్తెలకు, సోదరిలకు బంగారం, వెండి వస్తువులను కానుకగా ఇస్తే మంచిదని, కుటుంబానికి శుభమని నమ్మడం వల్లనే కొనుగోళ్లు ఈ స్థాయిలో జరుగుతున్నాయి.
ధరలు ఎంత పెరిగినా...
కేంద్ర బడ్జెట్ లో ఆరు శాతం బంగారంపై సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు కొంత శాంతించాయి. అంత భారీగా మాత్రం పెరగడం లేదు. అయితే దిగుమతులు తక్కువగా ఉన్నాయి. దేశంలో బంగారం నిల్వలకు కొదవలేదు. అలాగని అవి అమ్మకానికి ఉంచరు. కేవలం ఉన్న బంగారాన్నే వినియోగదారులకు ఆభరణాల రూపంలో అందించాల్సి ఉంటుంది. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లిన వారు అక్కడ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. కానీ మనదేశంలో జ్యుయలరీ దుకాణాల్లో మార్కెట్లో కనిపించే ధరల కన్నా అదనంగా కూడా వసూలు చేస్తారు. అయినా సరే బంగారం విషయంలో మాత్రం కొనుగోలు దారులు తగ్గడం లేదు.
గోల్డ్ తగ్గి... వెండి పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. స్వల్ప మొత్తంలో ధరలు పెరగడం, తగ్గడం కారణంగా వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,930 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,020 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 93,600 రూపాయలకు చేరుకుంది.
Next Story