Tue Nov 05 2024 19:37:29 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మండే రారమ్మంటుందిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కొద్దిగా పెరిగాయి.
పసిడి ప్రియులకు శ్రావణమాసం ప్రారంభంలోనే ధరలు తగ్గుతూ రారమ్మని పిలుస్తున్నాయి. నిజానికి ఇది ఊహించని విషయం అంటున్నారు వ్యాపారులు. సాధారణంగా సీజన్ లో ధరలు పెరుగుతాయని, అలాంటిది శ్రావణమాసంలో ధరలు తగ్గడమంటే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే కారణమని చెబుతున్నారు. దీంతో పాటు బంగారం కొనుగోలుదారుల సంఖ్య తగ్గిందా? అంటే ఎంత మాత్రం లేదు. వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దిగుమతులు లేకపోయినా డిమాండ్ పెరిగినా ధరలు తగ్గడమంటే వ్యాపారులు కూడా అనేక రకాలుగా కారణాలపై ఆరా తీస్తున్నారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు...
అయితే శ్రావణమాసంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువ జ్యుయలరీ షాపులు భారీ ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయి. తరుగు మీద ఇంత అని, ఇంత పసిడి కొంటే కొంత తగ్గిస్తామంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారీగా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి. ఊరించే అడ్వయిర్టైజ్మెంట్స్ తో కస్టమర్లను తమ వద్దకు రప్పించుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో బంగారం, వెండి వస్తువులకు గిరాకీ కూడా బాగానే ఉంది. ఈ సమయంలో బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకే. మధ్యాహ్నానికి మళ్లీ మార్కెట్ లో మారే అవకాశముంది. ధరలు తగ్గవచ్చు. పెరగవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,440 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,300 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 88,000 రూపాయలుగా ఉంది.
Next Story