Thu Dec 26 2024 17:46:50 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : మంచి కబురు...పసిడి ధరలు పరవాలేదు.. చెల్లీ... కొనేసుకోవడమే బెటర్
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి.
భారత్ లో బంగారు ఆభరణాల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఏ ఫంక్షన్ లోనైనా బంగారు ఆభరణాలతోనే కనిపించడానికి ఇష్టపడతారు. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. భారత్ లో అందులో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. బహుశ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న జ్యుయలరీ దుకాణలు దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఉండవన్న పేరుంది. పేరు మోసిన కార్పొరేట్ సంస్థలన్నీ ఈ ఐదు రాష్ట్రాల్లో తమ జ్యుయలరీ దుకాణాలను తెరవడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రాల్లోనే బంగారం, వెండి కొనుగోళ్లు అధికంగా ఉండటమే. అందుకే ఇక్కడ అధికంగా జ్యుయలరీ దుకాణాలు కనిపిస్తాయి.
దక్షిణాది రాష్ట్రాల్లోనే...
దక్షిణాదిన బంగారం పై ఉన్న మక్కువ ఉత్తర భారత దేశంలో తక్కువేనని అంటారు. అక్కడ ఎక్కువగా బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడరంటారు. అలాగే సంస్కృతీ సంప్రదాయాలు కూడా రెండు ప్రాంతాలకు భిన్నంగా ఉంటాయి. అందుకే దేశంలో ప్రతి రోజూ అమ్ముడుపోయే బంగారంలో దాదాపు 70 శాతం పసిడి దక్షిణ భారత దేశంలోనే విక్రయిస్తామని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతారు. అంత ఎక్కువ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. పెట్టుబడిగా బంగారంపై పెట్టేవారు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటారు. అందుకే బంగారు దుకాణాలు వీధికొకటి ఇక్కడ కనిపిస్తుంటాయి. అదే సమయంలో వెండి కి కూడా మంచి డిమాండ్ ఉంది.
స్వల్పంగా తగ్గినా...
గత కొద్ది రోజలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరగడంతో కొంత కొనుగోలు దారులు ఆలోచనలో పడ్డారు. బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న ధోరణిలో కనిపిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో బంగారం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,140 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,610 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రండ్ అవుతుంది.
Next Story