Mon Dec 23 2024 07:38:29 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : పసిడి కొనేవారికి పపందైన వార్త.. గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగానే తగ్గాయి
బంగారం ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్న వారికి అనుకున్నట్లుగానే ధరలు తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బంగారం అంటేనే ధరలు మండిపోతాయన్న భ్రమ నుంచి బయటపడేసేంతగా ధరలు తగ్గుతున్నాయి. అయితే ఎప్పుడు మాదిరిగా ధరలు స్వల్పంగా తగ్గడం లేదు. ఈసారి మాత్రం భారీగానే ధరలు తగ్గుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపడం కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. అలాగని ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయని భావిస్తే మళ్లీ ధరలు పెరిగి నిరాశకు గురవుతారని కూడా చెబుతున్నారు.
ధరలు తగ్గినప్పుడే...
ధరలు తగ్గినప్పుడే బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంతకంటే ధరలు పెద్దగా తగ్గవన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. కొత్త ఏడాది ప్రారంభం కానుండటం, ఇంకా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటం, శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయదలచుకున్న వారు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలోబంగారం, వెండి వస్తువులపై తగ్గుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.
ధరలు తగ్గి...
ఇక పసిడి ప్రియులను ఆకట్టుకునేందుకు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం అనేక ఆఫర్లను ఇయర్ ఎండింగ్ లో ప్రకటిస్తూనే ఉంది. వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఈ రకమైన డిస్కౌంట్లు ప్రకటిస్తూ కొనుగోళ్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగానే తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,440 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా కొనసాగుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story