Fri Nov 22 2024 19:25:52 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : వారెవ్వా.. ఇంత భారీగా ఎప్పుడూ తగ్గలేదే... కొనేయడానికి రెడీ అయిపోండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అందుకు పోటీ పడుతున్నాయి. ఆ రెండు స్టేటస్ సింబల్స్ గా మారడంతో డిమాండ్ ఏమాత్రం రెండింటికీ ఎప్పటికీ తగ్గవు. ఏ వస్తువుకు డిమాండ్ అయినా తగ్గుతుందేమో కానీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే బంగారం అంటే మహిళలకు అంత ఇష్టం కాబట్టి. శుభకార్యాల్లో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ పడిపోదన్నది అందరికీ తెలిసిందే.
ఆభరణాలపైనే...
బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నా సరే కొనుగోళ్లు మాత్రం ఆగవు. ఎందుకంటే ఎంత కొన్నా బంగారం బంగారమే అని భావిస్తుంటారు. అందులోనూ దక్షిణ భారత దేశంలో ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. గోల్డ్ బిస్కట్లు, బాండ్ల కన్నా ఆభరణాలపైనే మగువలకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారు. అందుకే బంగారం, వెండి అదనంగా సప్లయ్ కాకున్నా, డిమాండ్ పెరుగుతుండటంతో వాటి ధరలు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంటాయి.
భారీగా తగ్గి...
అయితే ఒక్కోసారి ధరలు భారీగా తగ్గుతాయి. అది అరుదుగా జరిగే విషయమే అయినప్పటికీ అప్పుడప్పుడు అలా తగ్గి కొనుగోలు చేయాలంటూ ఊరిస్తుంటాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై 1400 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరలపై 2,500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,160 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 83,000 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story