Mon Nov 25 2024 13:46:49 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. వెండి ధరలు కూడా దిగువకు చూశాయి.
పసిడి ప్రియులకు ఊరట నిచ్చే వార్త ఇది. వరసగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా నేల చూపులు చూస్తున్నాయి. దీనికి అనేక కారణాలున్నప్పటికీ బంగారం, వెండి ధరలు దిగి రావడంతో గోల్డ్ లవర్స్ కు మంచి కిక్కిచ్చే వార్త అనే చెప్పాలి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. మొన్నటి వరకూ ధరలు పెరుగుతూ పోతుండటంతో పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
ఆభరణాల కోసం...
బంగారం అంటేనే మహిళలు అత్యంత ఇష్టపడే వస్తువు. సమాజంలో గౌరవం లభించడంతో పాటు తమ భవితకు భద్రతగా దానిని చూడటం ప్రారంభమయిన తర్వాత బంగారం, వెండి కొనుగోళ్లపై మహిళలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. తాము ఆభరణాలను ధరించకపోయినా బంగారం ఇంట ఉంటే చాలు అన్న రీతిలో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇక ఏ శుభకార్యమైనా బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయంగా మారింది. అది అలవాటుగా చేసుకుని కొనుగోలు చేస్తున్నారు.
తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. వెండి ధరలు కూడా దిగువకు చూశాయి. నిన్న పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,890 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 94, 990 రూపాయలుగా ఉంది.
Next Story