Mon Jan 13 2025 02:49:59 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : వావ్... గోల్డ్ ధరలు ఇంత దిగిరావడం ఎప్పుడైనా చూశామా? కొనేసాయండి సామీ
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే రీతిలో భారీగానే తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుతున్నాయి. శ్రావణమాసంలో ధరలు ఈ రేంజ్ లో తగ్గడం అంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే ఈరోజు నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. బంగారం, వెండి కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పెరగాల్సిన ధరలు తగ్గుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందుకే మహిళలకు ఇష్టమైన బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని, తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచనలు వెలువడుతున్నాయి.
అనేక కారణాలతో...
పసిడి అంటే పడి చచ్చే వారు అనేక మంది. ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. పెట్టుబడిగా మాత్రమే కాదు స్టేటస్ సింబల్ గా చూస్తుండటంతో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుంటారు. మారుతున్న సమాజంలో బంగారానికి మరింత డిమాండ్ పెరగడంతో వాటి ధరలు కూడా అందనంత దూరంలో వెళతాయని భావిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, తగినన్ని బంగారం నిల్వలు లేకపోవడంతో ధరల్లో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన తర్వాత ధరలు తగ్గుతున్నాయి.
భారీగా తగ్గుదల...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే రీతిలో భారీగానే తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయలు తగ్గింది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇటీవల కాలంలో అరుదైన విషయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,700 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 82,400 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story