Tue Nov 26 2024 15:25:42 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : షాక్ ల మీద షాక్ లు.. రోజూ పెరుగుతున్న బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చినట్లే కనిపిస్తుంది. పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరసగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు కూడా పసిడి కొనుగోలుపై సందిగ్దంలో పడ్డారు. అసలు బంగారం కొనాలా? వద్దా? అన్న మీమాసం వారిని పట్టిపీడిస్తుంది. అయితే పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు విధిగా బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండు మూడు రోజుల నుంచి...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్‌ల మీద షాకులిస్తున్నాయి. అయితే కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తమ వ్యాపారం సజావుగానే జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదల కారణంగా బంగారం ధరలు మరింత ప్రియంగా మారిపోయాయి. బంగారం ధరలు ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోవడంతో కొనుగోలు చేయాల్సిన వారు కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా మమ అనిపించేస్తూ శుభకార్యాల తంతు ముగించేస్తున్నారు.
ఈ రోజు ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,250 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 79,500 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story