Tue Nov 26 2024 13:47:11 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : పసిడి ధరలు పెరిగిపోతున్నాయ్.. ఏ మాత్రం ఆలోచించినా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ తగ్గితే బాగుండని భావిస్తారు. అది మహిళల బలహీనత. ధరలు.. తగ్గినా.. తగ్గకపోయినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగవు. మన భారతీయ సంస్కృతి అలాంటిది. శుభకార్యంలో మేళాల సౌండ్ ఎలా వినపడుతుందో... మహిళల మెడలో గోల్డ్ అలా కనపడాలి. ఇక పెళ్లిళ్లకయితే పెట్టిపోతలు ఎన్నో ఉంటాయి. అందుకే తులాల కొద్దీ బంగారాన్ని పెళ్లిళ్ల సీజన్ లోనే కొనుగోలు చేస్తుండం ఆనవాయితీగా వస్తుంది.
స్కీమ్ పద్ధతిలో...
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సులువే. ఈవీఎం పద్ధతిలోనూ గోల్డ్ ను సొంతం చేసుకునే వీలుంది. జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వాయిదాల పద్ధతిని ప్రవేశపెట్టారు. అందులో రాయితీలను కూడా ఇస్తూ ఊరిస్తుంటారు. డిస్కౌంట్ కాకుండా తరుగు పేరుతో రారమ్మని పిలుస్తూనే ఉంటారు. స్కీమ్లలో చేర్చుకుని పూర్తయిన తర్వాత తమ వద్దనే బంగారాన్ని కొనుగోలు చేసేలా ఉసిగొల్పుతారు. స్కీమ్ ఎప్పుడు కట్టినా ఆరోజు బంగారం ధర మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లాభం వారికి.. కష్టం కన్స్యూమర్లకు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర పై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 78,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story