Tue Dec 24 2024 01:55:47 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : ఎదురుచూపులు నిజం కావు.. బంగారం ధరలు దిగిరావు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వాటి పెరుగుదలకు అడ్డుకట్ట వేయడం ఎవరి వల్లా కాదు. ఎంతగా ఎదురుచూసినా బంగారం, వెండి ధరలు తగ్గవు. తగ్గినా స్వల్పంగానే తప్పించి.. తాము ఊహించిన స్థాయిలో బంగారం ధరలు నేలచూపులు చూసే అవకాశం మాత్రం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. బంగారం ధరలు ఒకసారి పెరిగాయంటే ఇంక భారీ స్థాయిలో తగ్గడమనేది జరగని పని. అది ఫిక్స్. అందుకు అందరూ మానసికంగా సిద్ధమయి ఉండాలని మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తుంటారు.
గతంలో ఎన్నడూ....
బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు జరుగుతుండటమే ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. బంగారం నిల్వలు తక్కువ.. డిమాండ్ ఎక్కువ కావడంతో సహజంగా ధరలను అదుపు చేయడం ఎవరి వల్ల సాధ్యపడదన్నది వ్యాపార వర్గాలు అంచనాగా వినిపిస్తుంది. అందుకే ధరలు తగ్గుతాయని వెయిట్ చేయకుండా ఎప్పుడు కొనుగోలు చేయాలనుకుంటే అప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు కూడా మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
పైగా సీజన్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ధరలు అదుపులో లేకుండా పెరిగే ఏకైక వస్తువు కేవలం బంగారం మాత్రమేనని అందరికీ తెలిసిందే. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,670 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story