Tue Jan 07 2025 21:17:35 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. మహిళలకు మంచి కబురు.. నేటి బంగారం ధరలు ఇవే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. అయినా కొనుగోళ్లు మాత్రం అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. వాటి ధరలను అదుపులో ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. డిమాండ్ అధికంగా ఉండటం, నిల్వలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బంగారానికి, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. బంగారంపై పెట్టుబడితే నష్టం అనేది రాదు. మనం పెట్టిన డబ్బుకు తిరిగి అంతకు అంత సొమ్ము వచ్చే అవకాశాలు ఒక్క బంగారం, వెండి విషయంలోనే సాధ్యమవుతుంది.
డిమాండ్ ఎక్కువయినా...
అయితే దేశీయంగా బంగారానికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. బంగారం, వెండి వస్తువులను సెంటిమెంట్ గా భావిస్తారు. తమ వద్ద ఎంత ఉంటే అంత భద్రత లభిస్తుందని భావిస్తారు. క్లిష్ట సమయాల్లో బంగారాన్ని సులువుగా కుదువ పెట్టుకుని డబ్బులు తీసుకునే అవకాశముంటుంది. దీనిపై వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అందుకే బంగారం కొనుగోళ్లు ఎప్పుడూ సీజన్ తో నిమిత్తం లేకుండా జరిగిపోతుంటాయి. దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ పండగకు, పుట్టిన రోజుకు కూడా బంగారం కానుకగా ఇవ్వడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇక పెళ్లిళ్లలో అయితే బంగారం తప్పనిసరి కావడంతో సీజన్ లో మరింత ధరలు పెరుగుతాయి.
నిలకడగా ధరలు...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అయినా సరే కొనుగోళ్ల పై పెద్దగా ప్రభావం చూపలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువయిందని, రానున్న కాలంలో మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,500 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,000 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 91,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story