Tue Nov 26 2024 00:42:44 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
పసిడి అంటేనే పడి పడి కొనుగోలు చేస్తారు. పసిడి కొనాలన్న ఆశలు ఎప్పటి నుంచో ఉంటాయి. అది సాకారమయిన వేళ ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళలు పసిడి కొనుగోలు చేసేందుకు తపన పడి పోతుంటారు. ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా పసిడిని ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్న సంప్రదాయాన్ని పాటించాలని భావిస్తారు. అవసరమయిన దాని కంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తారు. అందుకే బంగారానికి భారత్ లోనూ.. అందులోనూ దక్షిణ భారతదేశంలోనూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
నాడు అలంకారం...
ఒకనాడు అలంకారంగానే భావించే బంగారం నేడు స్టేటస్ సింబల్ గా మారింది. ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొనుగోలు చేయడంలో ఎవరూ వెనుకాడటం లేదు. ఇప్పుడు బంగారానికి ఒక సీజన్ లేకుండా పోయింది. కొనుగోళ్లు పెరిగినంతగా బంగారం నిల్వలు లేకపోవడంతో వాటి ధరలు మరింత పెరిగిపోతున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న సంక్షోభం కూడా బంగారం ధరల్లో మార్పులు, చేర్పులకు కారణమవుతుంది. డాలర్ తో రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధరలు మరింత పెరగడానికి కారణమని చెప్పాలి.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వెళుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడినట్లయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,500 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,550 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 89,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story