Tue Nov 12 2024 23:54:10 GMT+0000 (Coordinated Universal Time)
రిలీఫ్ కాక మరేంటి?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది తక్కువ. తగ్గినా చాలా తక్కువ మొత్తంలో కనిపిస్తాయి. అదే ధరలు పెరిగితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజమే. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకుల ప్రభావంతో ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. పెట్టుబడిగా చూసేవారు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఉన్న డిమాండ్ తో ఇప్పుడు ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తులం బంగారం అరవై ఐదు వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
ఈరోజు కూడా...
ఈ సమయంలో గత రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది చాలదు కొనుగోలు దారులకు రిలీఫ్ అని చెప్పడానికి. ఈరోజు కూడా దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,950 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర మార్కెట్ లో 79,000 రూపాయలుగా నమోదయింది. సో.. గోల్డ్ లవర్స్ ఈరోజు కొనుగోలు చేస్తే మీ కొనుగోలు మొత్తంలో కొంత ఆదా అయ్యే అవకాశాలున్నాయి.
Next Story