Mon Apr 07 2025 00:45:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇక కొనలేమేమో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 220 రూపాయలు పెరిగింది

పసిడికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. రోజురోజుకూ దానికి డిమాండ్ పెరగడమే తప్ప తరిగేదేమీ ఉండదు. పైగా పెట్టుబడి కింద బంగారం ఉపయోగపడుతుండటంతో ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. భారతీయ సంస్కృతి కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పండగలు పబ్బాలు మాత్రమే కాదు ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యక్రమాాలకు కూడా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
అపురూప వస్తువులుగా...
బంగారం, వెండి అనేవి అపురూప వస్తువులుగా మారనున్నాయి. రెండూ ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. అయినా కొనుగోలుదారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త డిజైన్లతో జ్యుయలరీ దుకాణాలు మగువలను ఆకట్టుకుంటుండటం ఒక కారణమయితే, బంగారం ధర మరింత పెరిగే అవకాశముందన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికతో ముందుగానే కొనుగోలు చేసిన వారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 220 రూపాయలు పెరిగింది. వెండి కూడా కిలోపై ఏడు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర 59,890 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 78,200 రూపాయలకు చేరుకుంది. ధరలు మరింత పెరిగే అవకాశమున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Next Story