Mon Dec 23 2024 19:17:45 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : ధరలు తగ్గాయని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి.వెండి ధర కూడా భారీగా తగ్గింది
బంగారం ధరలు తగ్గాయంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ మధ్య కాలంలో బంగారం కొనాలంటే గగనమై పోతుంది. సామాన్య, పేద వర్గాలకు అందుబాటులో లేకుండా పోయింది. బంగారం అంటేనే నిజంగా బంగారంగా మారిపోయింది. అలాంటి బంగారం ధరలు తగ్గాయంటే ఎవరికి మాత్రం సంతోషం ఉండదు. ధరలు తగ్గుతుంటే కొనుగోలు చేయకపోయినా అదో ఆనందం. మనం కొనుగోలు చేస్తామని కాదు.. బంగారం అందుబాటులోకి వస్తుందన్న ఆశతోనే అంత ఆనందం కలుగుతుంది. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి అందరి మనోభావాలు ఇలాగే ఉంటాయి.
రానున్న కాలంలో..
ఇక రానున్నది దీపావళి, ధన్ తెరాస్.. ఈ వేళ బంగారం ధరలకు మరింత రెక్కలు రాక మానవు. పైగా పెళ్లిళ్ల సీజన్ మరో నాలుగు నెలల పాటు పెళ్లిళ్లు జరుగుతూనే ఉంటాయి. దాదాపు యాభై లక్షల పెళ్లిళ్లు జరుగుతాయన్న అంచనా వినపడుతుంది. అందునా దక్షిణ భారత దేశంలో పెళ్లిళ్లకు ఖచ్చితంగా బంగారాన్ని కానుకగా సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ఈ కాలంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడతాయి. మార్కెట్ నిపుణులు కూడా అదే చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈ పరిస్థితుల్లో ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై 700 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,250 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,360 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర మార్కెట్ లో 77,500లుగా ట్రెండ్ అవుతుంది.
Next Story