Mon Jan 13 2025 22:38:37 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : షాకింగ్ న్యూస్...మళ్లీ పెరిగిన వెండి ధరలు.. తిరిగి లక్షకు చేరుకున్న కిలో వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి
బంగారం ధరలు ఎప్పికప్పుడు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే హెచ్చు తగ్గులను గమనించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం అనేక మంది అలవాటుగా మార్చుకున్నారు. మధ్యాహ్నం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండే అవకాశం లేదు. ధరలు పెరిగినా, తగ్గినా అది ఇబ్బంది కావడంతో కొంత వెయిట్ చేసి బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ముఖ్యంగా మదుపరులు బంగారం ధరలు బాగా తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెట్టుబడిగా చూస్తుంటారు. అదే సమయంలో అవసరానికి మాత్రం అంటే పెళ్లిళ్లు, శుభకార్యాలకు కొనుగోలు చేసే వారు మాత్రం ధరలను చూసే అవకాశం లేదు.
భవిష్యత్ సంపదగా...
బంగారం ఉంటే భవిష్యత్ కు సంపదగా ఎవరైనా భావిస్తారు. భవిష్యత్ లో జరిగే కష్టనష్టాలను బంగారం ఆదుకుంటుందన్న ఆశతో వీలయినప్పుడల్లా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసి తమ వద్ద ఉంచుకుంటారు. సులువుగా మార్పిడి చేసుకునే వీలుండటం కూడా కొనుగోళ్లు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణంగా చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు కూడా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో అనేక కారణాలతో ధరల్లో హెచ్చు తగ్గులుంటే బంగారం విషయంలో మాత్రం ఎంత కొనుగోలు చేసినా నష్టం రాదన్న ధీమాతోనే ఎక్కుువ మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు.
భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ లో సహజంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఆఫ్ సీజన్ అంటూ ఏమీ ఉండదు. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు కొంత తగ్గడంతో మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లకు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 130 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పన్నెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,900 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,01,100 రూపాయలుగా ఉంది.
Next Story