Mon Dec 23 2024 13:31:02 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ధరలు పెరగడం ఆపడం ఎవరి తరమూ కాదట
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి కూడా భారీగానే పెరిగి అందకుండా పోయింది
బంగారం ఎప్పుడూ అంతే. తగ్గిందని ఆనందించే లోపే మన చేతికందకుండా పరుగులు పెడుతుంది. అందుకే చిక్కినప్పుడే దానిని అందిపుచ్చుకోవాలి. మహిళలు అప్పు చేసైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. పైగా దసరా పండగ. ఇక ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడం ఎవరి తరమూ కాదు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు చెబుతున్నా రానున్న కాలంలో మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. అరవై ఐదు వేలకు పది గ్రాముల బంగారం చేరుకునే రోజు ఎంతో దూరం లేదంటున్నారు.
భారీగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి కూడా భారీగానే పెరిగి అందకుండా పోయింది. పది గ్రాముల బంగారం ధరపై 1,530 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వందల రూపాయలుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,400 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,440 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 77,000 రూపాయలకు చేరుకుంది.
Next Story