Mon Jan 06 2025 06:20:39 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం ధరలు మోత మోగుతున్నాయిగా.. ఇక కొనడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది.
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పరుగు పెరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెరుగుతూ కొనుగోలు దారులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. కొనుగోళ్లు కూడా భారీగా తగ్గే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. పది గ్రాముల బంగారం దాదాపు మళ్లీ ఎనభై వేల రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు కూడా కిలో లక్షకు చేరుకుంది.దీంతో అమ్మకాలు గణనీయంగా పడి పోయే అవకాశముందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ధరలు పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో పెరుగుతాయని ఊహించలేదు. బంగారం ధరలు అంచనాలకు భిన్నంగా పెరిగిపోవడంతో మార్కెట్ నిపుణులు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లు లేక...
కొత్త ఏడాది ప్రారంభం నుంచి ధరల పెరుగుదల ప్రారంభం కావడంతో ఇక బంగారం ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవని అర్థమయింది. వచ్చే ఏడాదికి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. అంత డబ్బుపెట్టి బంగారం కొనుగోలు చేయడం అవసరమా? అన్న అభిప్రాయం మొదలయింది. ఆకర్షణ, స్టేటస్ సింబల్ కు మాత్రమే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అది తమకు అవసరం లేదన్న నిశ్చితాభిప్రాయానికి చాలా మంది వచ్చారు. దీంతో తొలి ఏడాది నుంచి జ్యుయలరీ దుకాణాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయని చెబుతున్నారు.
అమ్మకాలు పడిపోయి...
అమ్మకాలు పడిపోవడంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా నష్టపోతున్నారు. నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇంతకు ముందు బంగారం డిజైన్లు చూసి కొంత టెంప్ట్ అయి కొనుగోలు చేసే వారని, కానీ ఇప్పుడు దుకాణాలకే రావడం మానేశారని, దీనికి కారణం ధరల పెరుగుదలేనని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై 900 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,610 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,00,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story