Wed Dec 18 2024 06:40:18 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బ్యాడ్ లక్ బంగారం ధరలు ఇలా పెరిగితే ఎలాగబ్బా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతన్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ధరలకు బ్రేక్ అనేది పడదు. బంగారానికి ఉన్న డిమాండ్ కారణంగా ధరలు ప్రతి రోజూ పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు రెక్కలు వచ్చేశాయి. అందుకే బంగారం ధరలను అస్సలు నమ్మడానికి వీలులేదు. ఇంకా తగ్గుతాయని వెయిట్ చేయడం అంత పిచ్చి పని మరొకటి ఉండదని వ్యాపారులు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజూ ధరల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంటుంది. అనేక కారణాలతో ఉదయం, సాయంత్రానికి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం మంచిందన్నసూచనలు వెలువడుతున్నాయి.
ఇప్పుడే కాదు...
బంగారం, వెండి వస్తువులకు గిరాకీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది. అది ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నేళ్లుగా ధరలను పోల్చుకుని చూసుకుంటే బంగారం ఇంత భారీగా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. పదేళ్ల క్రితం ఉన్న ధరలకు ఇప్పుడు మూడు రెట్లకు ధరలు చేరుకోవడంతో అప్పుడు కొనుగోలు చేసిన బంగారానికి మంచి విలువ వచ్చింది. అందుకే పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం విషయంలో ఎప్పుడూ తగ్గరు. ఖచ్చితంగా ఆదాయం రావడమే కాకుండా తమ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని విశ్వసిస్తారు. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది అలవాటు పడి పోవడం కూడా డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
బంగారం భారీగా పెరిగి...
బంగారం వెండి అనేవి స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు. అవి తమ భవిష్యత్ కుభద్రతగా భావిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అందువల్లనే బంగారం, వెండి కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తగ్గినా అది కొద్ది కాలమే. మళ్లీ కొనుగోళ్లు పుంజుకుంటాయి. ధరలను చూసి బంగారం, వెండి వస్తువులను కొనుగోలుచేయడం మానేశారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతన్నాయి. పది గ్రాముల బంగారంధరపై 120 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,160 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story