Fri Nov 01 2024 06:32:40 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : దీపావళి దెబ్బ చూపించిందిగా.. ఒక్కసారిగా బంగారం ధరలు భగభగలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులకు ధరలు అందుబాటులో లేవు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీపావళి తర్వాత పసిడి ధరలు మరింత పెరిగిపోయాయి. వెండి ధరలు కూడా లక్ష దాటడంతో వాటిని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. బంగారం, వెండి వస్తువులను ముట్టుకుంటే షాక్ తగులుతున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడిని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థిితి దీంతో బంగారం ధరలు తాము వేసుకున్న అంచనాలను మించి పోయి ఉండటంతో ఎక్కువగా కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
తగ్గిన కొనుగోళ్లు...
పసిడి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఈసారి ధరలు పెరగడంతో థన్తెరాస్ కు కూడా అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. వ్యాపారులు కూడా కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఎప్పుడూ థన్ తెరాస్, దీపావళికి ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరిగేవి. కానీ ఈసారి ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు దారులు కూడా వెనకడుగు వేస్తున్నారు. పెట్టుబడి కోసం పెట్టేవారు తప్పించి బంగారం అవసరమైన వాళ్లు, దానిని ఇష్టపడే వాళ్లు మాత్రం కొనుగోలు చేయడం మాత్రం తగ్గించేశారని, అందుకే గత ఏడాది కంటే బంగారం అమ్మకాలు ఇరవై నుంచి ముప్పయి శాతం మేరకు పడిపోయాయని జ్యుయలరీ దుకాణం యజమానులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన ధరలు..
దీపావళికి బంగారం పది గ్రాముల ధర 82 వేలకు చేరువగా ఉంది. ఈ నెలాఖరుకు అది 90 వేల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుకు వెనకంజ వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మూడు రోజుల్లోనే బంగారం ధర పదిహేను వందల రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు ఈ రోజు కిలో పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,340 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,08,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story