ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఒక రోజులో ఎన్ని చలాన్లు విధిస్తారు?
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవర్..
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవర్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపం, ఇలా ఒకటేమిటి ఎన్నో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదాలు చేసే వారు ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. ఇంకా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చలాన్ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్ పడితే ఆ రోజంతా చలాన్ విధించరేనది చాలా మంది భావన. ఆ రోజంతా ఇష్టానుసారంగా తిరగొచ్చు అంటూ అనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారికి ట్రాఫిక్ నిబంధనలు తెలిసి ఉండవు. చలాన్లకు సంబంధించిన ఈ నిజం తెలిస్తే మాత్రం ఇంకెప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడరు. అంతేకాదు చలాన్ల నుంచి తిప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఏదైనా కారు/బైక్ పై రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు చలాన్ వేసే అవకాశం ఉంటుందా? అనే అనుమానం చాలా మందిలో తలెత్తుతుంటుంది.