మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగమేంటి?
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో..
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆధార్‌కార్డు విషయంలో మోసాలు పెరిగిపోయాయి. మన ఆధార్ కార్డును ఇతరులు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆధార్ దుర్వినియోగం కేసులు పెరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డుల కాపీలను ఎవరికీ పంపకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఆధార్ కార్డులను స్వీకరించడానికి లైసెన్స్ లేని సంస్థల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు. ఆధార్ కార్డుదారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు కాపీకి బదులుగా మాస్క్డ్ ఆధార్ కార్డు (Masked Aadhaar Card)లను ఇవ్వాలని సూచిస్తోంది ప్రభుత్వం. మరి ఈ మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి..? దీని గురించి కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియకపోవచ్చు. ఎవరికైనా ఆధార్ కార్డ్ కాపీలను ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఏజెన్సీలు, సంస్థలకు ఆధార్ వివరాలను అందించడానికి సురక్షితమైన మార్గం మాస్క్డ్ ఆధార్ కార్డులను అందజేయడమే ముఖ్యమని చెబుతున్నారు టెక్ నిపుణులు.
మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి?
మాస్క్డ్ ఆధార్ కార్డ్ పొందడం ఎలా..?
ఈ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించాలి?
మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా..?
➦ అధికారిక UIDAI వెబ్సైట్ myaadhaar.uidai.gov.inని ఓపెన్ చేయాలి.
➦ అందులో కనిపించే ట్యాబ్‌లలో ‘మై ఆధార్’అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
➦ డ్రాప్-డౌన్ మెనూలో 'డౌన్లోడ్ ఆధార్' సెలక్ట్ చేసుకోవాలి.
➦ ఆ తర్వాత 12-అంకెల ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ID లేదా ఎన్రోల్మెంట్ నంబర్‌ను ఇందులో ఏదైనా నమోదు చేయాలి.
➦ ఆ తర్వాత 'మాస్క్డ్ ఆధార్' ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
➦ తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి.
➦ తర్వాత అక్కడ కనిపించే డ్రాప్-డౌన్ మెనూలో 'సెండ్ OTP' క్లిక్ చేయాలి.
➦ ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్ మీ వద్ద తప్పకుండా ఉండాలి.
➦ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాత మాస్క్డ్ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.