కూలీ అకౌంట్లో రూ.221 కోట్లు డిపాజిట్.. షాకైన ఐటీ శాఖ
ఒక్కోసారి మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లో ఊహించని విధంగా కోట్లాది రూపాయలు డిపాజిట్ అవుతుంటాయి...
ఒక్కోసారి మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లో ఊహించని విధంగా కోట్లాది రూపాయలు డిపాజిట్ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్యాంకులు చేసే పొరపాటు వల్ల ఒక అకౌంట్కు పంపే డబ్బు వేరొకరి అకౌంట్లోకి పంపుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు . ఏకంగా రూ.221 కోట్లు తన ఖాతాల్లో వచ్చి పడ్డాయి. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది! అతని ఖాతాలో ఉన్న డబ్బు అతనికి ఇబ్బందుల పాలు చేసింది. చివరికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి అకౌంట్లోకి ఏకంగా రూ.221 కోట్లు వచ్చా పడ్డాయి..? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా..? అప్పుడు అదే పనిలో ఉన్నారు పోలీసులు.
ఆదాయపు పన్ను శాఖ వారు ఈ డబ్బును చూసి ఆ కార్మికుడి ఇంటికి నోటీసు పంపించారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఓ కార్మికుడి ఇంటికి ఆదాయపు పన్ను నోటీసు చేరడంతో కలకలం రేగింది. శివప్రసాద్ నిషాద్ అనే వ్యక్తి ఢిల్లీలో టైల్స్ గ్రైండింగ్లో పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతని ఖాతాలో 221 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న అతను స్వగ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.