UPI IDలు డీయాక్టివేట్ అవుతాయి.. చెక్ చేసుకోండి
దేశంలో UPI లావాదేవీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిపోతుండటంతో బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
దేశంలో UPI లావాదేవీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిపోతుండటంతో బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఏటీఎం కార్డుల వాడకం కూడా భారీగానే తగ్గిపోయినట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. యూపీఐ లావాదేవీలు వేగంగానే పెరిగిపోతున్నాయి. నెలనెల రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు నమోదు అవుతున్నాయి. కానీ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఉపయోగించని వారు కూడా చాలా ఉంటారు. ఈ నేపథ్యంలో UPI IDకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
చాలా మందివి యూపీఐ ఐడీలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అన్ని బ్యాంకులు PhonePe, Google Pay వంటి థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌యాక్టివ్ గా ఉన్న UPI IDలను మూసివేయబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకులను థర్డ్ పార్టీ యాప్‌లలో ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ IDలను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం NPCI డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఏదైనా సందర్భంలో ఈ తేదీకి ముందే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న మీ UPI IDని యాక్టివేట్ చేసుకోండి.
UPI IDని బ్లాక్ చేయడానికి ముందు బ్యాంక్ వినియోగదారులకు ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా నోటిఫికేషన్‌ను కూడా పంపుతుంది. NPCI ఈ దశతో UPI లావాదేవీలు మునుపటి కంటే మరింత సురక్షితంగా మారతాయి. అలాగే తప్పుడు లావాదేవీలు కూడా నిలిచిపోతాయి. ఇందుకే యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకుని ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు చేయని వారు ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోవడం ఉత్తమం. లేకుంటే మీ యూపీఐ ఐడీ బ్లాక్ అయిపోతుంది.