మీరు బంగారు నగలు కొంటున్నారా..? ఇది తప్పనిసరి ఉండాలి!
మీరు బంగారం గానీ, నగలు గానీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఒక విషయం తప్పకుండా గుర్తించుకోవాలి. లేకపోతే మీరు మోసపోయే..
మీరు బంగారం గానీ, నగలు గానీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఒక విషయం తప్పకుండా గుర్తించుకోవాలి. లేకపోతే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. బంగారం అభరణాలు కొనుగోలు చేసే ముందు హాల్ మార్క్ ఉన్నవి మాత్రమే కొనాలి. లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే హాల్‌మార్కింగ్ అనేది స్వచ్చతకు నిదర్శనం. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. హాల్‌మార్క్‌లేని అభరణాలు విక్రయిస్తున్న షాపులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మార్క్ ఉండటం వల్ల నకిలీ అభరణాలు విక్రయించేందుకు వీలు లేకుండా ఉంటుంది.
హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?
మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలో తెలియదు. అలాంటి సమయంలో మీకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మందికి ఒరిజినల్, నకిలీవి అనేవి పెద్దగా తెలియవు. బంగారం విషయంలో అనుభవం ఉన్నవారికి మాత్రమే తెలుస్తోంది. బంగారం నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. నగల షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలి. హాల్‌మార్కింగ్ లేని నగలు అమ్మడానికి వీలులేదు. అలా అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్ లేని నగలు కూడా లభిస్తున్నాయి.
హాల్‌మార్క్ ఉన్న అభరణాలను గుర్తించడం ఎలా?
అయితే మీరు ఇప్పటికే నగలు కొన్నట్లయితే స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్ మార్క్ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
అయితే హాల్‌మార్క్ అనే విధానాన్ని 2019లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, తర్వాత గడువు విధిస్తూ అమలు చేస్తూ వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారం దెబ్బతిందని, గడువు పెంచాలని స్వర్ణకారులు కోరడంతో గడువు పొడిగిస్తూ వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. హాల్‌మార్క్ లేని నగలు కొనవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రజల వద్ద పాత నగలకు హాల్‌మార్క్ లేకపోయినా వారు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు కేంద్రం తెలిపింది. పాత నగలు గానీ, బంగారం గానీ కొన్న వ్యాపారులు తిరిగి అమ్మేటప్పుడు దాన్ని కరిగించి హాల్ మార్క్‌తో నగలు తయారుచేసి అమ్మాల్సి ఉంటుంది. నగలు అమ్మేటప్పుడు ఏ క్యారెట్ ప్రకారం అమ్మారో చెబుతూ, ఎంత డబ్బు తీసుకున్నారో ఆ వివరాలతో సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.