Fri Nov 08 2024 05:58:29 GMT+0000 (Coordinated Universal Time)
'యూపీఐ లైట్' వల్ల ఉపయోగం ఏంటి?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దేశంలో యూపీఐకి మరింత క్రేజ్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దేశంలో యూపీఐకి మరింత క్రేజ్ పెరిగిపోతోంది. నెలనెల రికార్డు స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. యూపీఐ భారతదేశంలో అతిపెద్ద నగదు లావాదేవీగా రికార్డు ఉంది. యూపీఐని అభివృద్ధి చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCL) తరచుగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అటువంటి ప్రత్యేక సిస్టమ్ యూపీఐ లైట్ (UPI Lite). ఇది చిన్న లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. యూపీఐ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లో యూపీఐ లైట్ వాలెట్ లాగా పనిచేస్తుంది.
అయితే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ వ్యవస్థ రెండు బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును సరైన సమయంలో బదిలీ చేయగలదు. ప్రతి బ్యాంక్ ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ కేటాయించబడుతుంది. దీని ద్వారా నిధులు బదిలీ చేయబడతాయి. ఇప్పుడు యూపీఐ లైట్ వాలెట్ యాప్‌ల వలె పనిచేస్తుంది. Paytm, Phone Pay వాలెట్లలో డబ్బు నింపినట్లయితే, డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ ఖాతాను తాకాల్సిన అవసరం లేదు. వాలెట్లోని డబ్బును నేరుగా ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా పిన్ నమోదు చేయవలసిన అవసరం లేదు. యూపీఐ లైట్ దాదాపు అదే విధంగా పనిచేస్తుంది.
యూపీఐ వాలెట్లో మీ బ్యాంక్ ఖాతా నుంచి లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే యూపీఐ లైట్లో రూ. 4,000 కంటే ఎక్కువ ఉండకూడదు. లైట్ ద్వారా రూ.200 కంటే ఎక్కువ లావాదేవీలు చేయలేరని గుర్తించుకోండి. బ్యాంకు ఖాతా నుంచి రోజుకు గరిష్టంగా 20 యూపీఐ లావాదేవీలు సాధ్యమవుతాయి. మీరు యూపీఐ ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుండి రోజుకు రూ. 2 లక్షల వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు. 24 గంటల్లో బ్యాంక్ ఖాతాను ఉపయోగించి 20 యూపీఐ లావాదేవీలు మాత్రమే చేయవచ్చు.
వాలెట్లో లావాదేవీ పరిమితి లేదు. మీ వాలెట్లో నిధులు ఉన్నంత వరకు మీరు చాలా లావాదేవీలు చేయవచ్చు. ఈ లైట్లో రోజుకు రూ. 4,000 లావాదేవీల పరిమితి ఉంది. అయితే ఆ మొత్తం అయిపోయే వరకు మీరు ఎన్ని లావాదేవీలు చేయాలన్నా చేయవచ్చు. యూపీఐ లైట్ చిన్న చెల్లింపుల కోసం రూపొందించబడిందని గుర్తించుకోండి.
Next Story