ఈ 3 బ్యాంకులపై రూ.10.34 కోట్ల జరిమానా.. కారణం ఏంటంటే..
బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే విధంగా కొత్త కొత్త..
బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే విధంగా కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఆర్బీఐ రూల్స బ్యాంకులు పాటించడం లేదని ఆర్బీఐ ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. నిబంధనలు పాటించిన బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝులిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మూడు బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
జరిమానా విధించిన బ్యాంకులు:
1. సిటీ బ్యాంక్
2. బ్యాంక్ ఆఫ్ బరోడా
3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఈ మూడు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ మొత్తం 10.34 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించింది. ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుట్‌సోర్సింగ్‌పై ప్రవర్తనా నియమావళికి సంబంధించిన నిబంధనలను పాటించనందుకు సిటీ బ్యాంక్‌పై గరిష్టంగా రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాపై 4.34 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. అలాగే ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకుపై 1 కోటి రూపాయల జరిమానా పడింది.
పెనాల్టీ ఎందుకు విధించారంటే..
'సెంట్రల్ రిపోజిటరీ' ఏర్పాటుకు సంబంధించిన సూచనలను ఉల్లంఘించినందుకు రుణం, ఇతరత్రా కారణాల వల్ల ఈ మూడు బ్యాంకులపై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇది కాకుండా, రుణ సంబంధిత సూచనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. మూడు కేసులకు సంబంధించి రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై పెనాల్టీ ఆధారపడి ఉంటుందని RBI తెలిపింది. బ్యాంకులు తమ కస్టమర్లతో చేసుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడం దీని ఉద్దేశ్యం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, సరైన పనితీనం లేని కారణంగా అభ్యుదయ సహకార బ్యాంకు డైరెక్టర్ల బోర్డును ఆర్బీఐ ఏడాది పాటు సస్పెండ్ చేసింది. సహకార బ్యాంకును నిర్వహించడానికి సెంట్రల్ బ్యాంక్ ఒక నిర్వాహకుడిని నియమించింది. ముంబైకి చెందిన ఎస్బిఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ పాఠక్‌ను ఒక సంవత్సరం పాటు అడ్మినిస్ట్రేటర్‌గా నియమించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అడ్మినిస్ట్రేటర్‌కు సహాయం చేయడానికి సలహాదారుల కమిటీని కూడా నియమించారు. అభ్యుదయ సహకార బ్యాంకుపై ఆర్బీఐ ఎలాంటి వ్యాపార ఆంక్షలు విధించలేదు. అడ్మినిస్ట్రేటర్ మార్గదర్శకత్వంలో బ్యాంక్ తన సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.