ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డులు డియాక్టివేట్ అవుతాయా? రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ
ఈ రోజుల్లో పాన్- ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరైపోయింది. జరుగుతున్న మోసాలు, ట్యాక్స్ ఎగ్గొట్టకుండా, ఇతరాత్ర మోసాలకు
ఈ రోజుల్లో పాన్- ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరైపోయింది. జరుగుతున్న మోసాలు, ట్యాక్స్ ఎగ్గొట్టకుండా, ఇతరాత్ర మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నింటిని ఆధార్‌తో లింక్ చేయాలని స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తుండగా, దీనిపై రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నారా అని రాజ్యసభలో కూడా ఒక ప్రశ్న సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. జూన్ 30 వరకు 54,67,74,649 పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఏ పాన్ కార్డును డీయాక్టివేట్ చేయలేదని చెప్పారు. ఒకవేళ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ కేవలం పని చేయదని, కానీ డీయాక్టివేట్ కాదని స్పష్టం చేశారు.
పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30ని గడువుగా ఇచ్చింది. దీని తర్వాత ప్రజలు రూ.1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్లను లింక్ చేస్తున్నారు. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చాలా ముఖ్యమైన పనులు చేసుకోలేరు. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు, ట్యాక్స్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేసుకోలేరని తెలిపారు. అంతేకాకుండా పాన్‌ను ఆధార్‌కు లింక్ చేయకుండా మీరు ప్రభుత్వ పథకాలను పొందలేరని వెల్లడించారు.