Tue Dec 24 2024 18:34:00 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : హ్యాపీ న్యూస్ మహిళలూ.. బంగారం ధరలు భారీగా తగ్గాయ్
మగువలకు చాలా రోజాలకు శుభవార్త అందింది. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
మగువలకు చాలా రోజాలకు శుభవార్త అందింది. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిజానికి సీజన్ సమయంలో ధరలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. బంగారం విషయంలో ఎప్పుడూ జరగనిది ధరలు తగ్గడం. ఎందుకంటే పసిడి, వెండికి ఉన్న డిమాండ్ అటువంటిది. ఎక్కువ మంది కొనుగోళ్లు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. స్టేటస్ సింబల్ గా భావిస్తారు. బంగారం తమ వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా గౌరవం చుట్టుపక్కల వారి నుంచి లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అదేసమయంలో ధరలు పెరిగినా పెద్దగా వారికి ఇబ్బందులుండవు. బంగారాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో ధరలపై పెద్దగా దృష్టిపెట్టరు.
దక్షిణాది రాష్ట్రాల్లో...
దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదేరకమైన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే బంగారం ఒక సెంటిమెంట్ తో కూడినదిగా మారింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ప్రతి చిన్న కార్యక్రమానికి, కుటుంబంలో జరిగే చిన్న పాటి కార్యక్రమాలకు కూడా బంగారం కొనుగోలు చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. బంగారాన్ని బహుమతిగా ఇస్తే అదొకరకమైన అనుభూతి. అందుకే బంగారం కొనుగోళ్లు ఎప్పుడూ తగ్గవు. కానీ ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు..
బంగారం అంటేనే మక్కువ లేని వారు ఎవరుంటారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకంటే పసిడిని కొనుగోలు చేయడం హ్యాబీగా మార్చుకున్న వారు అనేక మంది ఉన్నారు. పెట్టుబడిగా కూడా అనేక మంది చూస్తున్నారు. బంగారం తమ వద్ద ఉంటే భద్రతతో పాటు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం, వెండి వస్తువులు నిత్యం విక్రయాల్లో ముందుంటాయి. అయితే నేడు ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు చాలా వరకూ తగ్గాయి. నిన్న ఒక్క రోజు పది గ్రాముల బంగారం ధరపై 1300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 4,600 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,100 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 94,900 రూపాయలకు చేరుకుంది. పసిడి కొనుగోళ్లకు ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story