Mon Dec 23 2024 11:25:13 GMT+0000 (Coordinated Universal Time)
ఈ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
మీరు ప్రభుత్వం నిర్వహించే చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవల..
మీరు ప్రభుత్వం నిర్వహించే చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవల పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చింది. కొత్త నిబంధనకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ పథకాలన్నింటిలో పెట్టుబడులకు ఆధార్, పాన్ తప్పనిసరి అని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
సెప్టెంబర్ 30 వరకు సమయం
ఇందుకోసం పెట్టుబడిదారులకు ఆర్థిక శాఖ సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పోస్టాఫీస్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వంటి అన్ని రకాల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కోసం పెట్టుబడిదారులు కేవైసీ కోసం పాన్, ఆధార్‌ను అందించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తించుకోండి.
మీరు ఆధార్ లేకుండా కూడా మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. నిర్దిష్ట పరిమితికి మించిన పెట్టుబడులపై పాన్ కార్డు ఇవ్వాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది కేంద్రం. మోదీ ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌కు ముందు ఈ పథకంలో పెట్టుబడిని ఆధార్ లేకుండా చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. సుకన్య సమృద్ధి వంటి పథకంలో ఖాతా తెరిచేటప్పుడు పాన్ కార్డ్ లేదా ఫారం 60 సమర్పించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ సమయంలో మీరు పాన్‌ను సమర్పించలేకపోతే మీరు దానిని రెండు నెలల్లోగా సమర్పించవచ్చు.
ఏయే పథకాలకు నిబంధన వర్తిస్తుంది?
- పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD)
- పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)
- పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)
- సుకన్య సమృద్ధి యోజన (SSY)
- పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD)
- మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( PPF)
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS)
- కిసాన్ వికాస్ పత్ర (KVP)
Next Story