Mon Dec 23 2024 17:44:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏడు కోట్ల నగలతో పరారీ
car driver absconded with diamond jewelery worth seven crores in hyderabad
హైదరాబాద్ లో ఒక కారు డ్రైవర్ ఏడు కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. మాదాపూర్ లోని మై హోం భుజ అపార్ట్మెంట్ లో ఉండే రాధిక వజ్రాభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్మెంట్ లో ఉండే అనూష యాభై లక్షల విలువైన ఆభరణాలను ఆర్డర్ చేశారు. నిన్న సాయంత్రం మధురానగర్ లో బంధువులు ఇంటికి వెళ్లిన అనూష నగలను అక్కడికే పంపమని చెప్పారు.
కారు డ్రైవర్ పనే...
దీంతో రాధిక తన కారు డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు సేల్స్మెన్ అక్షయ్ లకు ఏడు కోట్ల రూపాయల నగలు ఇచ్చి పంపారు. మధురానగర్ చేరుకున్న తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ అనూష ఉన్న ఇంట్లోకి వెళ్లి నగలు ఇచ్చి వచ్చి చూస్తే కారు లేదు. సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జ్యుయలర్స్ కు ఇవ్వాల్సిన ఏడు కోట్ల విలువైన నగలు కారులోనే ఉన్నాయి. దీంతో కారు డ్రైవర్ శ్రీనివాస్ నగలతో పరారయినట్లు గుర్తించి అక్షయ్ వెంటనే రాధికకు చెప్పారు. ఆమె ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.
Next Story