Mon Dec 23 2024 08:44:18 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. కొబ్బరిముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ఆదివారం తెల్లవారుజామున మణికంఠ ఏడుస్తుండటంతో.. తల్లి కవిత ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది. అదితిన్న బాలుడికి..
కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో 10 నెలల వయసున్న చిన్నారి ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన తెలంగాణలోని నెక్కొండ మండలంలో ఆదివారం ఉదయం వేకువజామున జరిగింది. బదావత్ మాలు-కవిత దంపతులకు మణికంఠ (10 నెలలు) వయసున్న బాలుడు ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అయ్యప్పమాల ధరించిన తండ్రి మాలు.. ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ దేవుడికి కొబ్బరికాయలు కొట్టేవారు.
ఆదివారం తెల్లవారుజామున మణికంఠ ఏడుస్తుండటంతో.. తల్లి కవిత ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది. అదితిన్న బాలుడికి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయింది. చిన్నారి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఇటీవల ఓ చిన్నారి తన తండ్రి ఆస్ట్రేలియా నుండి తెచ్చిన చాక్లెట్లు తిని మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story