Sat Dec 21 2024 02:34:05 GMT+0000 (Coordinated Universal Time)
శ్రద్ధ హత్య తరహాలో ఢిల్లీలో మరో ఘటన.. భర్తను చంపేసి 10 ముక్కలు చేసి..
పూనమ్ కు కూడా అంతకుముందు వివాహం జరిగింది. ఆమె భర్త 2016లో చనిపోవడంతో, 2017లో పూనమ్, అంజన్ దాస్..
ఢిల్లీలో శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే.. అలాంటి మరో హత్యోదంతం అక్కడే వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తను చంపేసి, 10 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచింది. ఈ ఘటనలో ఆమె కొడుకు కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ పాండవ్ నగర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అంజన్ దాస్, తన భార్య పూనమ్, కొడుకు దీపక్ తో కలిసి ఉంటున్నాడు. అంజన్ కు అంతకుముందే మరో మహిళతో వివాహం జరిగింది. ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు.
పూనమ్ కు కూడా అంతకుముందు వివాహం జరిగింది. ఆమె భర్త 2016లో చనిపోవడంతో, 2017లో పూనమ్, అంజన్ దాస్ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పూనమ్ కు దీపక్ అనే కొడుకు ఉన్నాడు. ఈ ముగ్గురు పాండవ్ నగర్లో ఉండేవాళ్లు. పెళ్లైంది మొదలు.. అంజన్ దాస్ పని చేయకుండా ఇంట్లో ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని పూనమ్, కొడుకు దీపక్ నిర్ణయించుకున్నారు.
అతను తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపారు. అదితాగి అతను నిద్రపోయాక ఇద్దరూ కలిసి అతడి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతడి శరీరాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచి ఉంచారు. ఆ తర్వాత వీలు చూసుకుని ఒక్కోరోజు ఒక్కో శరీర భాగాన్ని పడేస్తూ వచ్చాడు. ఇంట్లో ఎలాంటి వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రక్తపు మరకలు కనిపించకుండా గోడలకు పెయింట్ చేశారు. కొద్దిరోజులకు ఇంటికి సమీపంలో అతని శరీరభాగాలు కనిపించడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పూనమ్, దీపక్ లు నిందితులని తేలగా.. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. అజన్ శరీర భాగాలు మరికొన్ని దొరకాల్సి ఉంది.
Next Story