Tue Nov 05 2024 16:19:28 GMT+0000 (Coordinated Universal Time)
రెండు బస్సులు ఢీ.. 12 మంది దుర్మరణం
ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు, ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులందరినీ బెర్హంపూర్‌లోని MKCG మెడికల్
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూన్ 25న అర్థరాత్రి రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ వైద్య కళాశాలకు తరలించారు. క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నామని గంజాం డీఎం దిబ్యా జ్యోతి పరిదా తెలిపారు. ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు, ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులందరినీ బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మృతి చెందగా, ఇంకొందరు గాయపడ్డారు. OSRTC బస్సులో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓఎస్ఆర్టీసీ బస్సు రాయగడ నుంచి భువనేశ్వర్‌కు వెళుతుండగా, ప్రైవేట్ బస్సు బెర్హంపూర్ నుంచి జిల్లాలోని ఖండదేవులి గ్రామం నుంచి పెళ్లి బృందంతో తిరిగి వస్తోందని ఆయన తెలిపారు. దిగపహండి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పలువురు ప్రయాణికులను రక్షించారని బెర్హంపూర్ ఎస్పీ తెలిపారు. ఒడిశా ప్రభుత్వం గాయపడిన ప్రతి వ్యక్తికి చికిత్స కోసం రూ.30,000 ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story