Mon Dec 23 2024 07:22:12 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - అభిషేక్ కు 14 రోజుల రిమాండ్
అలాగే ఇతర నిందితులైన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఇంటి నుండి తెచ్చే ఆహారం అందించేందుకు అనుమతి..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దోషిగా ఉన్న అభిషేక్ కి ఈడీ కస్టడీ ముగిసింది. నేడు అధికారులు అతడిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడైన విజయ్ నాయర్ ను మరో 4రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.
అలాగే ఇతర నిందితులైన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఇంటి నుండి తెచ్చే ఆహారం అందించేందుకు అనుమతి నిరాకరించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అనుమతించడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వారికేదైనా కావాలంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవచ్చని సూచించడంతో.. కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశమివ్వాలని నిందితుల తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. జైలులో అన్ని పుస్తకాలు దొరుకుతాయని ప్రత్యేకంగా తెప్పించాల్సిన అవసరంలేదని న్యాయమూర్తి బదులిచ్చారు.
Next Story