Sat Mar 15 2025 20:30:40 GMT+0000 (Coordinated Universal Time)
లోయలో పడిన పెళ్లి బస్సు.. 14 మంది దుర్మరణం
డెహ్రాడూన్ సమీపంలోని బుడంలో జరిగిన పెళ్లికి వారంతా హాజరయ్యారు. తిరిగి వస్తుండగా.. సుఖిదాంగ్ రీతా సాహిబ్ రోడ్డు పై

పెళ్లి వేడుకల్లో అప్పటివరకూ బంధు మిత్రులందరితో వారంతా సరదాగా గడిపారు. కొత్త దంపతులను ఆశీర్వదించి తిరుగు పయనమయ్యారు. ఆ ప్రయాణంలో ఊహించని రీతిలో మృత్యువు వారిని కబళించింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. పెళ్లిబస్సు లోయలో పడి, 14 మంది మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. పెళ్లికి వెళ్లి.. తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది.
డెహ్రాడూన్ సమీపంలోని బుడంలో జరిగిన పెళ్లికి వారంతా హాజరయ్యారు. తిరిగి వస్తుండగా.. సుఖిదాంగ్ రీతా సాహిబ్ రోడ్డు పై బస్సు అదుపుతప్పి చంపావత్ లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 16 మందిలో 14 మంది అక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అప్పుడే పెళ్లి వేడుకల నుంచి వెళ్లిన తమ బంధువులంతా ప్రమాదంలో మరణించారని తెలియడంతో.. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story