Mon Dec 23 2024 12:11:10 GMT+0000 (Coordinated Universal Time)
వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా అనాధాశ్రమంలో చేర్పించారు. 20 రోజులుగా వారికి ఉపాధి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పలు వ్యభిచార గృహాల నుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వారిలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలో గౌరవంగా బ్రతికేలా కౌన్సిలింగ్ ఇచ్చి.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా అనాధాశ్రమంలో చేర్పించారు. 20 రోజులుగా వారికి ఉపాధి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. కాగా.. గత రాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ ప్రకారం ఆశ్రమంలోని బాత్రూమ్ వెంటిలేటర్ ను విరగొట్టి ప్రహరీ గోడ దూకి పరారయ్యారు.
ఉదయం అనాధాశ్రమం సిబ్బంది చూసేసరికి ఆ 14 మంది మహిళలు కనిపించలేదు. దాంతో ఆశ్రమంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి చూడగా.. వారంతా గోడదూకి పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. వారంలో 19-25 వయస్సు మధ్య మహిళలే. ఆశ్రమ నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి పరారైన మహిళల కోసం వెతుకున్నారు.
Next Story