Sat Dec 21 2024 02:29:39 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో దారుణం.. 15 ఏళ్ల బాలుడితో కోచ్ అసహజ శృంగారం
అప్పుడు కోచ్ చేసిన పనిని వివరించాడు. దాంతో కుటుంబ సభ్యులు సదరు కోచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలుడిపై ఓ కబడ్డీ కోచ్ అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డాడు. విద్యార్థిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కోచ్ ను బుధవారం (డిసెంబర్ 21) అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి జిల్లా కంఝవాలా ప్రాంతంలో తన కొడుకును కబడ్డీ నేర్చుకునేందుకై ఓ అకాడమీలో చేర్పించాడు. రోజూ అకాడమీకి వెళ్లొచ్చే కొడుకు.. కొద్దిరోజులుగా అకాడమీకి వెళ్లడం లేదు. ఏమిటని అడిగితే కుటుంబ సభ్యులతోనూ మాట్లాడలేదు. ఆరోగ్యం కూడా క్షీణించినట్టుగా ఉండటంతో.. ఏమైందని అడిగారు కుటుంబ సభ్యులు.
అప్పుడు కోచ్ చేసిన పనిని వివరించాడు. దాంతో కుటుంబ సభ్యులు సదరు కోచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకు ప్రశ్నించగా.. బాలుడిపై అత్యాచారం చేయడం నిజమని తేలింది. విద్యార్థులకు కబడ్డీ కోచింగ్ ఇచ్చే అతను.. ఎవరూ లేని సమయంలో బాధిత బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడే వాడని వెల్లడైంది. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 377, 506 కింద కేసు నమోదు చేసినట్లు.. పోలీసులు తెలిపారు. కోచ్‌ను కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబం పోలీసులను డిమాండ్ చేసింది.
Next Story