Mon Dec 23 2024 20:03:20 GMT+0000 (Coordinated Universal Time)
బాలికను కిడ్నాప్ చేసి.. కారులో గ్యాంగ్ రేప్, పెట్రోలింగ్ పోలీసుల రాకతో ?
రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. కారు అనుమానాస్పదంగా ఉండటంతో.. పెట్రోలింగ్ పోలీసులు..
రాంచీ : ఆడపిల్లలపై ప్రతినిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల బయట కనిపించడమే పాపమైపోతోంది. ఎందరు నిందితుల్ని శిక్షించినా.. ఎందరినో ఎన్ కౌంటర్ చేసినా కామాంధులు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. తాజాగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మే 11వ తేదీ, బుధవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు.. పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
ఆ రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. కారు అనుమానాస్పదంగా ఉండటంతో.. పెట్రోలింగ్ పోలీసులు కారును తనిఖీ చేశారు. కారులోపల ఏడుస్తూ కూర్చున్న బాలికను ఏం జరిగిందని అడగ్గా.. తనపై జరిగిన దారుణం గురించి వివరించింది. వెంటనే బాలికను వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాంచీ ఎస్పీ నౌషద్ ఆలమ్ తెలిపారు.
Next Story