Mon Dec 23 2024 15:53:56 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. అవయవాలు కాజేసి బాలికను బలితీసుకున్న వైద్యులు
బాలిక శరీరానికి పలు చోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో పోలీసులకు..
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె అవయవాలను కాజేసి.. వాటిస్థానంలో ప్లాస్టిక్ కవర్లను ఉంచి కుట్లు వేశారు. తీవ్ర అనారోగ్యంతో బాలిక మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలికను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. 24వ తేదీన బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26వ తేదీన బాలిక చనిపోయినట్లు ప్రకటించారు.
దాంతో తల్లిదండ్రులు బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో బాలిక శరీరానికి పలు చోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శస్త్రచికిత్స పేరుతో తమ కూతురి అవయవాలను కాజేశారని ఆస్పత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు. జనవరి 31న బాలిక మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామని, ఆ రిపోర్టు వస్తే బాలిక మరణానికి అసలు కారణం ఏంటనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Next Story