Mon Dec 23 2024 07:45:12 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. 12 గంటలపాటు బాలికపై సామూహిక అత్యాచారం
మృగాళ్ల చెర నుండి తప్పించుకుని.. పోలీసుల వద్దకెళ్లిన బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది.
ఆడపిల్లలపై దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్ని కేసుల్లో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినా, ఉరి తీసినా, కఠిన శిక్షలు అమలు చేసినా.. కామాంధుల తీరులో మార్పు రావట్లేదు. రోజురోజుకూ అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు కేసు పెట్టినా.. కొన్నాళ్లు జైల్లో ఉంచి వదిలేస్తారనుకుని రెచ్చిపోతున్న దుర్మార్గులున్నారు. 16 ఏళ్ల బాలికపై 8 మంది యువకులు ఒక రాత్రంతా సామూహిక అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.
మృగాళ్ల చెర నుండి తప్పించుకుని.. పోలీసుల వద్దకెళ్లిన బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది. పాల్ఘర్కు చెందిన బాలికను డ్రగ్స్ మత్తులో ఉన్న 8 మంది యువకులు సముద్ర తీరానికి లాక్కెళ్లారు. అక్కడ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బీచ్ కు సమీపంలోని గ్రామంలో ఉన్న ఓ ఖాళీ బంగ్లాలోకి తీసుకెళ్లి వరుసగా అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు ప్రారంభమై మరుసటిరోజు ఉదయం 10 గంటల వరకు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు వాపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 8 మంది యువకులపై కేసు నమోదు చేసుకుని, 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Next Story